పడ్డవాడు చెడ్డవాడు కాదు తెలుగు సామెత

పడ్డవాడు చెడ్డవాడు కాదు తెలుగు సామెత. చాలామంది చాలామంచిగా మాట్లాడుతూ ఓదార్పు మాటలలో కూడా ఈ తెలుగు సామెతను ప్రయోగిస్తూ ఉంటారు. కష్టంలో ఉన్న మనిషికి మంచి ఓదార్పు మాటలను చెబుతూ ఈ మంచి మాటలను మాట్లాడుతూ ఉండడం పరిపాటి. ఒక్కోసారి మనిషి మాట పడాల్సిరావడం జరగుతూ ఉంటుంది. తన తప్పు లేకపోయినా మాట పడవలసి వచ్చినప్పుడు, అతని వ్యక్తిత్వం గురించి తెలిసినవారు అతనికి మద్దతుగా మాట్లాడుతున్న సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు… Continue reading పడ్డవాడు చెడ్డవాడు కాదు తెలుగు సామెత

ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ప్రశ్నార్ధకంతో ఉండే ఈ సామెత మంచి ప్రశ్నగా ఉంటుంది. కారణం అనుకరించేవారు చెడిపోయారంటే, అందుకు మార్గదర్శకంగా ఉన్నవారు తప్పుడు పనులు చేసినట్టేగానే పరిగణిస్తారు. కాబట్టి మార్గదర్శకంగా ఉండేవారు ఉత్తమ ప్రవర్తన కలిగి ఉండాలనేది మన సంప్రదాయపు మాట. వారసత్వంగా వచ్చే అవలక్షణాలను కానీ వారసత్వంగా వచ్చే చెడు అలవాట్లను కానీ విమర్శిస్తూ ఇలాంటి చమత్కారపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. తండ్రికి దురలవాట్లు ఉంటే అవే కొడుకు కూడా అలవాటు… Continue reading ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తెలుగు సామెత

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తెలుగు సామెత చాలా ప్రసిద్ది. బలవంతుడు బలహీనుడిని టార్గెట్ చేసిన సందర్భాన్ని ఉటంకిస్తూ ఇలాంటి మంచి మాటలు ప్రయోగిస్తూ ఉంటారు. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తూ గాలి ఆధారంగా పనిచేస్తుంది. కానీ గాలిలో ఎగిరే అతి చిన్న ప్రాణి పిచ్చుక. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ప్రకృతి భీకరంగా మారుతుంది. అటువంటి బ్రహ్మాస్త్రమును అతి చిన్న ప్రాణి అయిన పిచ్చుకపై ప్రయోగిస్తే, వాటిని పిచ్చి చేష్టలు అంటారు. అలాగే కొందరి బలం అతి బలహీనులపై ప్రయోగించినా కూడా అలాగే… Continue reading పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తెలుగు సామెత

ఆస్తి మూరెడు ఆశ బారెడు తెలుగు సామెత

ఆస్తి మూరెడు ఆశ బారెడు తెలుగు సామెత. ఆర్ధిక పరిస్థితి, ఆశల పరిస్థితి పొంతన చూసి మాట్లాడేటప్పుడు ఇలాంటి తెలుగు సామెతలు ప్రయోగిస్తూ పెద్దలు చమత్కరిస్తూ ఉంటారు. అర్హతను బట్టి ఆలోచనలు ఉంటే, అర్హతను మరింత పెంచుకోవచ్చును. అర్హతలేని చోటకు వెళ్లడానికి చూస్తూ ఉన్న అర్హతకు న్యాయం చేయలేరని అంటారు. అలాగే ఆర్ధిక పరిస్థితిని బట్టి ఆలోచనలు సాగితే ఆశలు తీరతాయి కానీ ఆశలు పెద్దవి రాబడి చిన్నగా ఉంటే, మనసుకు భారమే అవుతుంది. ఆదాయం బట్టి… Continue reading ఆస్తి మూరెడు ఆశ బారెడు తెలుగు సామెత

పరిగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్ళు త్రాగడం మిన్న

పరిగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్ళు త్రాగడం మిన్న అంటారు. ఇది చాలా ప్రసిద్ది తెలుగు సామెత అయితే చాలామంది మంచి మాటగా చెబుతూ ఉంటారు. ఏదైనా పనిలో వేగంగా వెళ్ళి బోల్తాపడడం కన్నా, నిదానంగా ఆ పనిని పూర్తి చేయడం ఉత్తమం అని చెప్పవలసిన సందర్భంలో ఇలాంటి మంచి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా పనులు కూడా వేగంగా పూర్తి చేయాలనే కాంక్షతో పనులను మొదలుపెట్టి… Continue reading పరిగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్ళు త్రాగడం మిన్న

పొమ్మనలేక పొగ పెట్టినట్లు తెలుగు సామెత

పొమ్మనలేక పొగ పెట్టినట్లు తెలుగు సామెత బాగా ప్రసిద్ది. కారణం చాలామంది అయిష్టతను తెలియజేస్తూ ఉంటారు కానీ తెగేసి చెప్పరు. అలా ఒక వ్యక్తి తన అయిష్టతను చేతల రూపంలో తెలియజేస్తూ మాటలు మంచిగా మాట్లాడే సందర్భమును వర్ణిస్తే, ఇలాంటి తెలుగు సామెతలను ఉపయోగిస్తూ మాట్లాడుతారు. కొందరికి ప్రత్యక్షంగా చెబితే నొచ్చుకుంటారు కాబట్టి వారు పరోక్ష పద్దతిలో తమ అయిష్టతను తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఒక ఉద్యోగిని ఉద్యోగ బాధ్యతల నుండి తొలగించే సమయంలో కూడా ఒక్కొక్కరు… Continue reading పొమ్మనలేక పొగ పెట్టినట్లు తెలుగు సామెత

చల్లకొచ్చి ముంత దాచినట్లు

ఏదైనా అడిగడానికి ఇంటికి వచ్చిన వ్యక్తి, మొహామాటపడే సందర్భంలో ఇటువంటి మంచి మాటలు చమత్కారంగా మాట్లాడుతూ సంభాషణ కొనసాగిస్తూ ఉంటారు. ఎదుటివ్యక్తిలో మొహమాటం పోగొట్టి వచ్చిన కార్యం గురించి మాట్లాడే విధంగా ఇలాంటి తెలుగు సామెతలు ఉపయుక్తంగా ఉంటాయి. ‘చల్లకొచ్చి ముంత దాచినట్లు’ ఈ తెలుగు సామెత అర్ధం చూస్తే…. మజ్జిగ అడగడానికి వచ్చిన ఇల్లాలు, మజ్జిగ కోసం తెచ్చిన ముంత చెంగుచాటున పెట్టుకుందట. అదే ముంత పైకి కనబడే విధంగా ఉంటే, ఆమె మజ్జిగ అడగడానికే… Continue reading చల్లకొచ్చి ముంత దాచినట్లు

ఇల్లు అలకగానే పండుగ కాదు

ఇల్లు అలకగానే పండుగ కాదు కొత్తగా పని ప్రారంభించినప్పుడు, అలా పని ప్రారంభించిన వ్యక్తిని విమర్శించేటప్పుడు కానీ లేక ఏదైన పని భవిష్యత్తులో ఆగిపోతుందనే సందేహం ఉన్నవారు ఆ పనిపై తమ అభిప్రాయం తెలియజేసే సందర్భంలో ఇటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కేవలం ఇల్లు అలకగానే పండగ పూర్తవదు. సదరు పండుగ ఆచారం అనురించి పూజలు, దీక్షలు, దానాలు, సాధన వంటివి ఉంటాయి. కాబట్టి పండుగ పూర్తయ్యేసరికి తగినంత ధనం కూడా అవసరం, తోటివారి సహకారం… Continue reading ఇల్లు అలకగానే పండుగ కాదు

నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట

ఎక్కువగా ఆర్ధిక క్రమశిక్షణ లేనివారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. కొందరు చిన్న వస్తువు కోసం ఎక్కువ ఖర్చు పెట్టి దాని స్పేర్స్ తీసుకుంటూ ఉంటారు. అలా చిన్న విషయాలలో కూడా ఎక్కువ ఖర్చును చేసేవారిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడే సందర్భాలలో ఇటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ”నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట” గుఱ్ఱపు నాడా ఖర్చు ఎంతో ఉండదు. అటువంటి నాడా చేతికి దొరికిందని ఖరీదైన గుఱ్ఱాన్ని కొనడం అంటే అజ్ఙానం క్రింద జమకడతారు. అంటే… Continue reading నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట

గోరంత ఆలస్యం కొండంత నష్టం

గోరంత ఆలస్యం కొండంత నష్టం ఈ తెలుగు సామెతను ఎక్కువగా సమయం విషయంలో చెబుతూ ఉంటారు. కొందరు బాగా కష్టపడతారు కానీ సమయపాలన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. సమయం ఎంత విలువైనదో బంగారంతో పోల్చి చెబుతూ ఉంటారు. అటువంటి సమయమును నిమిషాలతో సహా సరిగ్గా సద్వినియోగపరచుకున్నవారికి జీవితంలో మంచి స్థాయికి వస్తారని అంటారు. చిన్నపాటి ఆలస్యం పెద్ద నష్టాన్ని తెచ్చి పెడుతుందనే బావన ఈ తెలుగు సామెతలో ప్రస్పుటమవుతుంది. కొద్ది నిమిషాలే అనుకుంటూ సమయం వృధా చేయడం… Continue reading గోరంత ఆలస్యం కొండంత నష్టం