చల్లకొచ్చి ముంత దాచినట్లు

ఏదైనా అడిగడానికి ఇంటికి వచ్చిన వ్యక్తి, మొహామాటపడే సందర్భంలో ఇటువంటి మంచి మాటలు చమత్కారంగా మాట్లాడుతూ సంభాషణ కొనసాగిస్తూ ఉంటారు. ఎదుటివ్యక్తిలో మొహమాటం పోగొట్టి వచ్చిన కార్యం గురించి మాట్లాడే విధంగా ఇలాంటి తెలుగు సామెతలు ఉపయుక్తంగా ఉంటాయి. ‘చల్లకొచ్చి ముంత దాచినట్లు’ ఈ తెలుగు సామెత అర్ధం చూస్తే…. మజ్జిగ అడగడానికి వచ్చిన ఇల్లాలు, మజ్జిగ కోసం తెచ్చిన ముంత చెంగుచాటున పెట్టుకుందట. అదే ముంత పైకి కనబడే విధంగా ఉంటే, ఆమె మజ్జిగ అడగడానికే… Continue reading చల్లకొచ్చి ముంత దాచినట్లు

ఇల్లు అలకగానే పండుగ కాదు

ఇల్లు అలకగానే పండుగ కాదు కొత్తగా పని ప్రారంభించినప్పుడు, అలా పని ప్రారంభించిన వ్యక్తిని విమర్శించేటప్పుడు కానీ లేక ఏదైన పని భవిష్యత్తులో ఆగిపోతుందనే సందేహం ఉన్నవారు ఆ పనిపై తమ అభిప్రాయం తెలియజేసే సందర్భంలో ఇటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కేవలం ఇల్లు అలకగానే పండగ పూర్తవదు. సదరు పండుగ ఆచారం అనురించి పూజలు, దీక్షలు, దానాలు, సాధన వంటివి ఉంటాయి. కాబట్టి పండుగ పూర్తయ్యేసరికి తగినంత ధనం కూడా అవసరం, తోటివారి సహకారం… Continue reading ఇల్లు అలకగానే పండుగ కాదు

నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట

ఎక్కువగా ఆర్ధిక క్రమశిక్షణ లేనివారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. కొందరు చిన్న వస్తువు కోసం ఎక్కువ ఖర్చు పెట్టి దాని స్పేర్స్ తీసుకుంటూ ఉంటారు. అలా చిన్న విషయాలలో కూడా ఎక్కువ ఖర్చును చేసేవారిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడే సందర్భాలలో ఇటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ”నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట” గుఱ్ఱపు నాడా ఖర్చు ఎంతో ఉండదు. అటువంటి నాడా చేతికి దొరికిందని ఖరీదైన గుఱ్ఱాన్ని కొనడం అంటే అజ్ఙానం క్రింద జమకడతారు. అంటే… Continue reading నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట

గోరంత ఆలస్యం కొండంత నష్టం

గోరంత ఆలస్యం కొండంత నష్టం ఈ తెలుగు సామెతను ఎక్కువగా సమయం విషయంలో చెబుతూ ఉంటారు. కొందరు బాగా కష్టపడతారు కానీ సమయపాలన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. సమయం ఎంత విలువైనదో బంగారంతో పోల్చి చెబుతూ ఉంటారు. అటువంటి సమయమును నిమిషాలతో సహా సరిగ్గా సద్వినియోగపరచుకున్నవారికి జీవితంలో మంచి స్థాయికి వస్తారని అంటారు. చిన్నపాటి ఆలస్యం పెద్ద నష్టాన్ని తెచ్చి పెడుతుందనే బావన ఈ తెలుగు సామెతలో ప్రస్పుటమవుతుంది. కొద్ది నిమిషాలే అనుకుంటూ సమయం వృధా చేయడం… Continue reading గోరంత ఆలస్యం కొండంత నష్టం

రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

అదృష్టం వరించినప్పుడు లేక అనుకోకుండా మంచి అవకాశం అందుకున్నప్పుడు ఇటువంటి సామెతలు చెబుతూ ఉంటారు. ఎలా అంటే ‘రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు’ అంటూ మాటలు మాట్లాడుతూ ఉంటారు. రొట్టె బలమైన ఆహారం అయితే అది నేతితో తీసుకోవడం మరింత బలం. అలా ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఆ పనిలో అనుకోని సానుకూల ఫలితం పొందినప్పుడు ఇలాంటి తెలుగు సామెతలు పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఒక పోస్టులో మరి ఒక తెలుగు సామెత దాని అర్ధం గురించి… Continue reading రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

ఒడ్డు చేరేవరకు ఓడ మల్లయ్య ఒడ్డు చేరాకా బోడి మల్లయ్య

ఒడ్డు చేరేవరకు ఓడ మల్లయ్య ఒడ్డు చేరాకా బోడి మల్లయ్య బలే సామెత. చమత్కారంగా ఉన్నా సరే అవకాశవాదుల మనసును కదిలించే మాటలు… అవసరం ఉన్నంత సేపూ చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. అవసరం తీరగానే గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారి గురించి చెప్పే సందర్భంలో ఇటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవకాశవాదులు మాటలు అవకాశాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. వారి మాటలు అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మరి ఒక పోస్టులో… Continue reading ఒడ్డు చేరేవరకు ఓడ మల్లయ్య ఒడ్డు చేరాకా బోడి మల్లయ్య

రెక్కాడితే కానీ డొక్కాడదు సామెత

పేదరికంలో ఉన్న కుటుంబ పరిస్థితిని తెలియజేసే విధంగా ఉండే మాటలలో ఇది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏపూటకాపూటకు కష్టం చేసిన ధనంతో ఆహార పదార్దాలు తయారు చేసుకునే కుటుంబాలు మనదేశంలో ఇప్పటికీ ఉంటాయి. అటువంటి వారి గురించి చెప్పే సందర్భంలో ఇటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. రెక్కాడితే కానీ డొక్కాడదు సామెత ప్రయోగిస్తూ ఉంటారు. మద్య తరగతి కుటుంబాలలో కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే తమ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందనే… Continue reading రెక్కాడితే కానీ డొక్కాడదు సామెత

దానం చేయని చెయ్యి కాయలు కాయని చెట్టు

ఆచారంలో కొన్ని సామెతలు అలనాటి ఆచారపు పద్దతులలో కొన్నింటిని గుర్తుకు చేసేవిధంగా కొన్ని సామెతలు మనకు చక్కని అర్ధం అందిస్తాయి. అటువంటి మంచి మాటలు మాట్లాడేటప్పుడు ”దానం చేయని చెయ్యి కాయలు కాయని చెట్టు” అంటూ ఒక తెలుగు సామెత ప్రసిద్ది. కాయలు కాయని చెట్టు వలన ప్రయోజనం ఏముంటుంది? ఆ చెట్టు ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే అన్న భావన బలపడుతుంది. అలాగే దానం చేయని చెయ్యి అంటే సదరు వ్యక్తి ఎటువంటి దానాలు చేయకపోవడం… Continue reading దానం చేయని చెయ్యి కాయలు కాయని చెట్టు

శంఖులో పోస్తే కానీ తీర్ధం కానట్లు

ఎక్కడ ఏమి చెప్పాలో, అక్కడ అదే చెప్పాలి. ఒక చోట చెప్పవలసిన విషయం మరొక చోట చెప్పరాదు. బళ్లో పాఠాలు చెప్పాలి, గుళ్ళో ప్రవచనాలు చెప్పాలి. ఇంట్లో మంచి మాటలు చెప్పాలి… అలా మాట్లాడే సందర్భం గురించి చెబుతూ ఇటువంటి మంచి మాటలు ‘శంఖులో పోస్తే కానీ తీర్ధం కానట్లు’ చెబుతూ ఉంటారు. ఇంకా కొన్ని రకాల స్థలాల్లో కొన్ని వస్తువులు మంచి ధర పలికితే, వీధులలో ఇళ్లవెంబడి అమ్మేవారి దగ్గర సాదరణ ధర కన్నా తక్కువ… Continue reading శంఖులో పోస్తే కానీ తీర్ధం కానట్లు

కూర్చుని తింటే కొండలు అయినా కరిగిపోతాయి

సంపాధనలేనివారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కూర్చుని తింటే కొండలు అయినా కరిగిపోతాయి. కోట్ల ఆస్తి ఉన్నా, కూర్చుని తింటూ ఉంటే, అవి ఆవిరి అవ్వడం ఎంతో కాలం పట్టదు. కష్టం చేయాలి. కష్టానికి తగిన ఫలితం పొందాలి. కష్టం చేస్తూ శరీర పోషణ చేసుకోవాలి. వ్యక్తిపై ఆధారపడి ఉన్నవారిని పోషించాలి. కానీ ఖాళీగా కూర్చుని తింటూ కూర్చొనరాదు. బద్దకస్తులను దృష్టిలో పెట్టుకునే మాట్లాడేటప్పుడు కూడా నాలుగు మంచి మాటలు చెప్పవలసని సందర్భాలలో… Continue reading కూర్చుని తింటే కొండలు అయినా కరిగిపోతాయి