Tag: తెలుగు మాటలు

  • వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు

    వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు

    ఆర్ధికపరమైన విషయాలలో అవసరాల గురించి మాట్లాడే సందర్భంలో ఈ “వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు” మాటను వాడుతూ ఉంటారు. కుటుంబ పెద్దకు తోడుగా ఎవరైనా సంపాదిస్తున్నప్పుడు వారు తన యజమానికి తోడుగా ఎలా ఉన్నది చెబుతూ ఇలాంటి మాట ప్రయోగించవచ్చు. ఎవరైనా అయినవారు ఇంటికొస్తే, వారితో ఆర్ధికపరమైన విషయాలు మాట్లాడేటప్పుడు… తను చేస్తున్న పనిని కూడా కలుపుతూ తమ కుటుంబపెద్ద గౌరవం తక్కువ కాకుండా చాలా చక్కగా సమాధానం చెప్పే స్త్రీలు ఈ మాటను ఎక్కువగా […]

  • అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత

    అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత

    అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత… మంచి మాట రుచించనివారికి మంచి మాటలు చెప్పడం అంటే అంధుడికి అద్దం చూపించినట్టే. అలా మాట విననివారికి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఇలాంటి తెలుగు సామెతలు ఉపయోగిస్తూ ఉంటారు. అంధత్వం అంటే చూడలేకపోవడం… కంటిచూపు లేకపోవడం. ఇలా అంధత్వం కలిగి ఉన్నవారిని అంధులు అంటారు. ఏకవచనంలో అయితే అంధుడు అంటారు. అలాంటి అంధుడు లోకంలో ఏదైనా తన కంటితో చూడలేదు. అలాంటి ఒక అంధుడు ముందు అద్దం పెట్టి […]

  • సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట

    సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట

    సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట అంటూ అంటారు. అంటే ఇంద్రియాలలో కన్ను ప్రధానమైనది అంటారు. కన్ను కన్నా మిన్న ఏముంది? పరిశీలిస్తే అవుననే అంటాం. కన్ను లేకపోతే అంతా అంధకారమే… అంతా చీకటే… వినిపట్టుకోవడం కష్టం చూసి పట్టుకోవడం తేలిక అంటే అర్ధం చేసుకోవచ్చు కన్ను ఎంత ప్రముఖమైనదో…. కనిపించే ప్రతి విషయాన్ని మనసు గ్రహించే ప్రయత్నం చేస్తుంటుంది. కనిపించిన వాటిని చూస్తూ, కనబడని వాటిని కూడా మనసు ఊహించగలదు… అంటే మనసుకు ఊహాశక్తి అందించడంలో […]

  • గోరంత ఆలస్యం కొండంత నష్టం తెలుగులో సామెత

    గోరంత ఆలస్యం కొండంత నష్టం తెలుగులో సామెత

    గోరంత ఆలస్యం కొండంత నష్టం తెలుగులో సామెత. సమయం విలువను తెలియజేస్తూ… ఆలస్యం అయితే జరిగే నష్టతీవ్రతను తెలియజేస్తూ ఈ మాటను ప్రయోగిస్తూ ఉంటారు. ఏదైనా కార్యం సరైన సమయానికి జరిగితే, దాని ఫలితం అనుకున్నట్టు ఉంటుంది. లేకపోతే ఫలితం తారుమారు అవుతుంది. నిర్ధిష్ట సమయానికి పనులు పూర్తిచేయగలుగుట నిర్వహణ సామర్ధ్యం తెలియజేస్తుంది. అయితే ఒక్కోసారి వ్యక్తులు చేసే ఆలస్యం వలన ఒక వ్యవస్థ సైతం నష్టపోవలసి ఉంటుంది… అటువంటి నష్టం భారీగానే ఉండవచ్చు… చిన్నపాటి నిర్లక్ష్యంతో […]

  • గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు

    గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు

    గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు బాగా వాడుకలో ఉండే మాట. మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలాంటి సమయాలలో ఈ తెలుగు సామెతను ప్రయోగిస్తూ ఉంటారు. డబ్బులు పెట్టి కొన్న సున్నం అంతా బాగున్న గోడకే వేయడం వలన ప్రయోజనం ఏముంటుంది? డబ్బులు దండగ. అలాగే ఉచిత సలహాలు ఇవ్వడం కూడా అని అంటూ ఉంటారు. గోడ ఎలాంటిది అయినా ఒక సారి వేస్తే ఇక వేసినట్టే… ఆ సున్నం […]

  • గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత

    గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత

    గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత. ఇది కూడా తెలుగులో ప్రసిద్ది చెందిన సామెత… ఎదుటివారి తప్పులు ఎంచుతూ ఉండేవారు ఉంటారు ఐతే వారు తమ తప్పు తెలుసుకోరు అని చెబుతూ ఈ ప్రసిద్ది తెలుగు సామెతను ప్రస్తావిస్తూ ఉంటారు. ఎంతసేపు ఎదుటివారు తప్పులను మనసులో పెట్టుకుంటూ ఉంటే, అద్దంలో ముఖం కనబడినట్టు, ఎంతసేపు ఎదుటివారి తప్పులే కనబడుతూ తమ తప్పులు తాము ఎరుగలేరని అంటారు. తమ తమ తప్పులు వెనుకబడి, ఎదుటవారి తప్పులు కళ్ళల్లో […]

  • అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు

    అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు

    అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు… తెలుగు సామెత. ఇద్దరి మధ్యలో దూరేవారిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏ ఇద్దరి మధ్య అయినా మూడో వ్యక్తి ప్రమేయం అనవసరం అనే భావనను ఈ తెలుగు సామెత బలపరుస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలు మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు… అంటే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా భార్యాభర్తలు ఉంటున్నారంటే వారు కలిసిమెలిసి ఉంటున్నట్టు లెక్కగడతారు. అలాగే ఆప్త మిత్రులు, ప్రేమానురాగలతో […]

  • అంతా మన మంచికే తెలుగు సామెత

    అంతా మన మంచికే తెలుగు సామెత

    అంతా మన మంచికే తెలుగు సామెత. చాలామంది ఎక్కువగా ఉపయోగించే మాట. ఇది ఒక తెలుగు సామెత కూడా… అదే అంతా మనమంచికే… ఈ తెలుగు సామెత ఎప్పుడు పుట్టింది? ఎవరు మొదట పలికి ఉంటారు? అనే ప్రశ్నల కన్నా ఈ సామెత వెనుక ఉండే అర్ధం తెలియబడితే, అదే ఆ సామెత వాడుకలోకి రావడానికి ప్రధానం అయ్యి ఉంటుంది. ఇంతకీ “అంతామనమంచికే” ఈ తెలుగు సామెతలో ఉన్న అర్ధం ఏమిటి? ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అనుకోని […]