పొమ్మనలేక పొగ పెట్టినట్లు తెలుగు సామెత

పొమ్మనలేక పొగ పెట్టినట్లు తెలుగు సామెత బాగా ప్రసిద్ది. కారణం చాలామంది అయిష్టతను తెలియజేస్తూ ఉంటారు కానీ తెగేసి చెప్పరు. అలా ఒక వ్యక్తి తన అయిష్టతను చేతల రూపంలో తెలియజేస్తూ మాటలు మంచిగా మాట్లాడే సందర్భమును వర్ణిస్తే, ఇలాంటి తెలుగు సామెతలను ఉపయోగిస్తూ మాట్లాడుతారు. కొందరికి ప్రత్యక్షంగా చెబితే నొచ్చుకుంటారు కాబట్టి వారు పరోక్ష పద్దతిలో తమ అయిష్టతను తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఒక ఉద్యోగిని ఉద్యోగ బాధ్యతల నుండి తొలగించే సమయంలో కూడా ఒక్కొక్కరు… Continue reading పొమ్మనలేక పొగ పెట్టినట్లు తెలుగు సామెత

చల్లకొచ్చి ముంత దాచినట్లు

ఏదైనా అడిగడానికి ఇంటికి వచ్చిన వ్యక్తి, మొహామాటపడే సందర్భంలో ఇటువంటి మంచి మాటలు చమత్కారంగా మాట్లాడుతూ సంభాషణ కొనసాగిస్తూ ఉంటారు. ఎదుటివ్యక్తిలో మొహమాటం పోగొట్టి వచ్చిన కార్యం గురించి మాట్లాడే విధంగా ఇలాంటి తెలుగు సామెతలు ఉపయుక్తంగా ఉంటాయి. ‘చల్లకొచ్చి ముంత దాచినట్లు’ ఈ తెలుగు సామెత అర్ధం చూస్తే…. మజ్జిగ అడగడానికి వచ్చిన ఇల్లాలు, మజ్జిగ కోసం తెచ్చిన ముంత చెంగుచాటున పెట్టుకుందట. అదే ముంత పైకి కనబడే విధంగా ఉంటే, ఆమె మజ్జిగ అడగడానికే… Continue reading చల్లకొచ్చి ముంత దాచినట్లు

నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట

ఎక్కువగా ఆర్ధిక క్రమశిక్షణ లేనివారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. కొందరు చిన్న వస్తువు కోసం ఎక్కువ ఖర్చు పెట్టి దాని స్పేర్స్ తీసుకుంటూ ఉంటారు. అలా చిన్న విషయాలలో కూడా ఎక్కువ ఖర్చును చేసేవారిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడే సందర్భాలలో ఇటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ”నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట” గుఱ్ఱపు నాడా ఖర్చు ఎంతో ఉండదు. అటువంటి నాడా చేతికి దొరికిందని ఖరీదైన గుఱ్ఱాన్ని కొనడం అంటే అజ్ఙానం క్రింద జమకడతారు. అంటే… Continue reading నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట

ఊరికి ఉపకారి ఆలికి అపకారి తెలుగు మంచి మాటలు

ఊరికి ఉపకారి ఆలికి అపకారి తెలుగు మంచి మాటలు

ఊరికి ఉపకారి ఆలికి అపకారి అంటారు. సహజంగా వ్యక్తి తన ధర్మం ప్రకారం కుటుంబ బాద్యతతో బాటు సమాజంలో కూడా తనవంతు బాద్యతను తీసుకోవాలి అంటారు. కానీ కొందరు కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా సమాజానికి మేలు చేయాలనే కాంక్షతో ఉంటారు. ఆకాంక్ష మేరకు నిత్యం సమాజ ఉద్దరణకు ప్రయత్నిస్తూ, ఇంటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి తెలుగు సామెత మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో ఉండేది ఆలి అంటే భార్య. ఇలా… Continue reading ఊరికి ఉపకారి ఆలికి అపకారి తెలుగు మంచి మాటలు

పండిత పుత్ర పరమ శుంఠ

బాగా చదువులు చెప్పే మాష్టారుకు ఏమి చదువు అబ్బని కొడుకు ఉండడం గమనిస్తూ ఉంటారు. ఆ మాష్టారు దగ్గర చదువుకున్నవారు గొప్ప గొప్ప పదవులు అలంకరిస్తే, అతని కొడుకు మాత్ర నామమాత్రపు చదువు కూడా అబ్బని స్థితిలో ఉన్నప్పుడు ఇలా పండిత పుత్ర పరమ శుంఠ అంటూ పోలిక పెట్టి మాట్లాడుతూ ఉంటారు. గొప్ప నైపుణ్యం ఉండి సమాజంతో పేరు ప్రఖ్యాతుల సంపాదించినవారికి కూడా ఎందుకు పనికిరారు అనిపించే విధంగా కొడుకు ఉంటే, అటువంటి సందర్భంలో కూడా… Continue reading పండిత పుత్ర పరమ శుంఠ

మంచోళ్ళకు మాటలతోను మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి

మంచోళ్ళకు మాటలతోను మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి

మంచోళ్ళకు మాటలతోను మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి అని అంటూ ఉంటారు. మంచివారు మాటను అర్ధం చేసుకునే తత్వం ఉంటే, మొండివాళ్ళకు మాట వినే తత్వం ఉండదని అంటారు. కాబట్టి మంచి వారితో మాటలు వరకు సరిపడితే, మొండివారికి మొట్టికాయలతో సరిపెట్టాలి. మంచి వారికి మాట మంత్రంలాగా పనిచేస్తే, మొండివారికి కూడా మంచి మాట మొట్టికాయ మొట్టి చెబితే అది మహామంత్రంలాగా పనిచేస్తుంది అంటారు. అంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది అని అర్ధం చేసుకోవచ్చును. మరి ఒక… Continue reading మంచోళ్ళకు మాటలతోను మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి

తడిసి కానీ గుడిశె కట్టడు, తాకి కానీ మొగ్గడు

తడిసి కానీ గుడిశె కట్టడు, తాకి కానీ మొగ్గడు

గుడిశె కట్టరా బాబు అని ఇంట్లోవారు మొత్తుకుంటే కట్టకుండా పనికి పోతాడు. పనిలేనిరోజున ఇంట్లోనే ఉన్నప్పుడు వర్షం వస్తే తడుస్తాడు. వర్షం తగ్గగానే గుడిశె కట్టడానికి పూనుకుంటాడు. అంటే ఇక్కడ స్వానుభవం పొందాక ప్రయత్నం చేస్తాడు. అలాగే కాపురం విషయంలో కూడా తాకగానే పెళ్లాంవైపు మొగ్గుతాడు. కొన్ని అనుభవపూర్వకంగా చమత్కారమైన మాటలు పుడుతూ పాపులర్ అవుతూ ఉంటాయి. అనుభవించినప్పుడే కష్టసుఖాలు తెలుస్తాయనే సందర్భంలో మాట్లాడే మాటలలో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి ఒక పోస్టులో మరి… Continue reading తడిసి కానీ గుడిశె కట్టడు, తాకి కానీ మొగ్గడు

ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్క చెడతాడు తెలుగు సామెత

ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్క చెడతాడు

ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్క చెడతాడు తెలుగు సామెత ఎక్కువగా వాడుతూ ఉంటారు. తిరిగే ఆడదాని చెడ్డ చూపులు ఉంటాయి. చెడు చూపుకు చలించిన ఆడది చెడుతుంది. తిరగని మగవాడికి లోకం తీరు ఎలా ఉంటుందో తెలియదు. మోసపోవడానికి ఆస్కారం ఎక్కువ కాబట్టి తిరక్క మగవాడు చెడతాడని అంటారు. ఎక్కువ మంది ఎక్కువమార్లు ప్రయోగించే మాట. ఎప్పుడూ ఎవరో ఒకరి చాటున తిరుగుతూ ఉండే మగవారిని చూసి కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఊరు… Continue reading ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్క చెడతాడు తెలుగు సామెత

తంతే గారెల బుట్టలో పడ్టట్టు

తంతే గారెల బుట్టలో పడ్టట్టు

అదృష్టం ఒక్కోసారి మనిషి జీవితంలో ఇతరుల ద్వారా తలుపు తడుతుంది. ఇతరుల ఏదో చేయబోయి, వీరికి మేలు చేసినట్టవుతుంది. అలా ఒకరు తలపెట్టిన పని మరొకరికి మేలు చేస్తే అటువంటి సందర్భాలలో ఇటువంటి మంచి మాటలు ‘తంతే గారెల బుట్టలో పడ్టట్టు’ ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే ఏ బి లు ఇద్దరు ఒకే ఆఫీసులో ఉన్నారు. ఏకి బి అంటే పడదు. బి మీద ప్రతికారంతో ఏ ఆఫీసులోని పై అధికారికి పిర్యాదు చేశాడు. అప్పుడు కారణాలు… Continue reading తంతే గారెల బుట్టలో పడ్టట్టు

తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగితే

తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగితే

ఏ పన్ని ఎక్కడ ఎలా చేయాలో అలానే చేయుటను ఒక విధానమును అనుసరిస్తున్నట్టుగా చెబుతారు. అలా కాకుండా విధి విధనాలు, సమయాసమయాలు, ప్రాంతాలతో సంబంధంలేకుండా కొందరు చేసే పనులను విమర్శించేటువంటి సందర్భంలో ఇటువంటి మంచి మాటలే పెద్దలు చెబుతూ ఉంటారు…. ”తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగితే” అన్న చందాన అని సంభోదిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏపనిని ఎక్కడ చేయాలో, ఆపనిని అక్కడే చేయాలి. ఇంటి దగ్గర చేసే పనిని ఆఫీసులో చేయరాదు. ఆఫీసులో చేయవలసిన పనిని… Continue reading తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగితే